Breaking News

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి..

kcr

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్( టోమ్జా) రాష్ట్ర అద్యక్షులు అయిలు రమేష్, టీయూడబ్ల్యూజే జిల్లా అద్యక్షులు తాడూరు కరుణాకర్ లు కరీంనగర్ ఆర్డీవో కు విన్నవించారు. వేలాది మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని.. హెల్త్ కార్డులు చిత్తు కాగితాలయ్యాయని.. దీంతో దాదాపు 350కి పైగా జర్నలిస్టులు చనిపోయారని.. ఆర్థికంగా జర్నలిస్టులు నష్టపోయారని విన్నవించారు. అక్రిడిటేషన్ల కార్డులపై కూడా కేసీఆర్ రెండున్నరేళ్లు గడిచినా ఇంకా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికీ జిల్లాల్లో ఆంధ్ర ప్రభుత్వం జారీ చేసిన అక్రిడిటేషన్లే ఉన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అద్యక్షులు తాడూరు కరుణాకర్,  కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ , జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, జగన్ మోహన్ తో పాటు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *