కరీంనగర్ లో స్మిత సభర్వాల్

కరీంనగర్ నగరంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ జేడీ ప్రియంక వర్గీస్ లు పర్యటించారు. కరీంనగర్‌ నగరంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.. నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు మొక్కతో వారికి స్వాగతం పలికారు. అనంతరం నగరంలో మేయర్ తో పాటు స్మిత, వర్గీస్ లు మొక్కలు నాటారు.

smitha
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్మితా సబర్వాల్ మాట్లాడుతూ కరీంనగర్‌ నగరంలో లక్ష మొక్కలు నాటడం అభినందనీయం అన్నారు. ఇదేవిధంగా మరో లక్ష మొక్కలు నాటాలని సూచించారు. నగరంలో జరుగుతున్న హరితహారం, అభివృద్ధిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నీతూ ప్రసాద్,కమిషనర్ తో పాటు నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డివిజన్ కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్ , పాల్గొన్నారు.

 smitha2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *