Breaking News

నోటి దుర్వాసనను తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు!*

mouth-odor

కొందరు నోటి దుర్వాసన రాకుండా ఉండడానికి ఎన్నో చిట్కాలు పాటిస్తారు. అయినా కాని ఫలితం దక్కదు. దీంతో రకరకాల టూత్ పేస్టులు మారుస్తారు. ఇలా చేస్తే డబ్బులు వృధా తప్ప… పెద్దగా మార్పు ఉండదు. సాధారణంగా నోటి దుర్వాసన వచ్చే వారి నుండి దూరంగా ఉండాలనిపిస్తుంది. మొహమాటానికి వారి ముఖం మీద ఆ విషయం చెప్పలేక… వారి నుండి పక్కకు వెళ్ళాక తిట్టుకుంటాం.

మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా మెల్లిగా తప్పుకుంటున్నారంటే… నోటి దుర్వాసన వల్ల తప్పించుకుంటున్నారా అనేది గ్రహించండి. ముఖ్యంగా ఇంటర్వ్యూ సమయంలో గాని… లేదా కొత్తవారిని కలిసే సమయంలో గాని… దుర్వాసన వస్తే ఇక అంతే సంగతి.

ముందు నోటినుండి దుర్వాసనను తెప్పించే పదార్థాలు ఏంటో చూద్దాం:

* వెల్లుల్లి

* ఉల్లిపాయ

* కాఫీ

* ఆల్కహాల్

* నాన్-వెజ్

* పంచదార

* చీస్

* ముల్లంగి

* టమాటా

వీటి వల్ల కొత్తగా దుర్వాసన రావడమే కాదు… ఉన్న దుర్వాసన ఎక్కువవ్వడం కూడా జరుగుతుంది. అందుకే ఈ పదార్థాలు తినే అలవాటు మీకు ఉంటె వెంటనే తగ్గించుకోండి. అప్పుడప్పుడు తింటే పరవాలేదు కాని నలుగురితో కలిసే ముందే వీటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది.

ఇప్పుడు నోటి దుర్వాసనను తగ్గించే పదార్థాలు ఏంటో చూద్దాం:

* ఆపిల్ (గ్రీన్ ఆపిల్ కూడా)

* తులసి ఆకు

* పుదీనా

* అల్లం

* పాలకూర

* లేట్యుస్

* పుచ్చకాయ

* చెక్క

* గ్రీన్ టీ

* సోంపు

* నీరు

* పాలు

* విటమిన్-C ఉన్న పండ్లు

ఈ పదార్థాలను మీరు రోజు తినే ఆహారంలో ఉండేలా చూసుకోండి. ఒకవేళ నోటి దుర్వాసన ఉంటె తగుముఖం పడుతుంది. ఒకవేళ లేకుంటే రానీయకుండా చేస్తాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *