Breaking News

హన్మకొండ అవుట్.. సిరిసిల్ల ఇన్..

Siricilla-Town-Municipality-exploretelangana1

సిరిసిల్ల జిల్లాపై మంత్రి కేటీఆర్ ఫోకస్ చేశారు.. నియోజకవర్గ నేతలందరూ కలిసి ఒత్తిడి తేవడంతో సిరిసిల్లను ఎలాగైనా సరే జిల్లాను చేయాలని ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి, హన్మకొండ జిల్లాలకు కొన్ని మండలాలు పోయాయి. దీంతో కొత్తగా ఏర్పడ్డ ఆ రెండు జిల్లాలను రద్దు చేసైనా సరే సిరిసిల్లను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కృతనిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. అసలు సోదిలోనే లేని హన్మకొండ జిల్లాను సృష్టించి హుజూరాబాద్ ను అందులో కలిపేసిన తీరుపై మంత్రి కేటీఆర్ స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో హన్మకొండ జిల్లాను రద్దు చేసి వరంగల్ లో దాన్ని కలిపేసి సిరిసిల్లను జిల్లా చేయాలని కోరారట..

దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయిన కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా కోసం కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధం అయ్యాడని సమచారం. నెలరోజులు గడువు ముగియగానే కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ లో సిరిసిల్లను జిల్లా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు కేటీఆర్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *