Breaking News

సిరిసిల్ల జిల్లా కోసం లాబీయింగ్ మొదలైంది..

2014-10-14_192436_KTR_Karimnagar

కరీంనగర్ జిల్లాలోని మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా కోసం లాబీయింగ్ మొదలైంది. ఇన్నాళ్లు ప్రతిపక్షాలు మాత్రమే సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఆందోళనలు చేశాయి. కానీ ఇప్పుడు అధికార టీఆర్ఎస్ నాయకులు కూడా మొదలయ్యారు. సిరిసిల్ల తో పాటు పక్క నియోజకవర్గాల టీఆర్ఎస్ నాయకులంతా కలిసి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

సిరిసిల్ల జిల్లా కోసం మంత్రి కేటీఆర్ వద్దకు కూడా పోవాలని నిర్ణయించారు. అసలు సోదిలోనే లేని పెద్దపల్లి, హన్మకొండ జిల్లా కావంగ లేనిది మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ఎందుకు జిల్లా చేయరు అని నాయకులు నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి సిరిసిల్ల జిల్లా చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ లపై ఒత్తిడి తెస్తున్నారట.. దీంతో మళ్ల ీసిరిసిల్ల జిల్లా వేడి మొదలైంది. అభ్యంతరాల తర్వాత సిరిసిల్లను జిల్లా చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా హుస్నాబాద్ , కోహెడ మండలాలను కూడా కరీంనగర్ జిల్లాలో కలిపేసి సిరిసిల్లకు మరికొన్ని మండలాలను కలిపే యోచనలో ఉందట సర్కారు.. సో సిరిసిల్ల కోసం లాబీయింగ్ మొదలైనట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *