సిరిసిల్ల, నిర్మల్ జిల్లా లేనట్లే..!

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల పునర్వ్యస్థీకరణలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దసరా వరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఆమేరకు నెలరోజులుగా చేసిన హడావుడి ప్రస్తుతం సద్దుమణిగింది.. ఇప్పుడు జిల్లా కలెక్టర్లు కానీ, కేసీఆర్ గానీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ ఆ ఊసే ఎత్తడం లేదు.. కొందరు మంత్రుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మళ్లీ కొత్తగా జిల్లాల ఏర్పాటు కు మొగ్గుచూపింది. అందులో కరీంనగర్ జిల్లాలో కొత్త గా సిరిసిల్ల.. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మల్ జిల్లాలు తెరపైకి వచ్చాయి.

కాగా జూలై ఆఖరు వరకు కొత్త జిల్లాల కసరత్తు పూర్తి చేస్తామని ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. ఇందులో కొత్తగా వచ్చిన సిరిసిల్ల, నిర్మల్ ల విషయమై ఏ నిర్ణయాన్ని రాజీవ్ శర్మ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆగస్టులోగా ఈ నిర్మల్, సిరిసిల్ల జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది..

కాగా ప్రస్తుతం జరుగుతున్న జిల్లాల కసరత్తులో నిర్మల్, సిరిసిల్ల ప్రతిపాదనలను ప్రస్తుతానికి పక్కనపెట్టి ఇతర జిల్లాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తుది నిర్ణయం మేరకే ఈ రెండు జిల్లాల ఏర్పాటవుతాయిని అధికార వర్గాలు తెలిపాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *