
తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలలో అతి చిన్న జిల్లా సిరిసిల్లనేనట.. అసలు కేసీఆర్, కలెక్టర్లు ముందు నిర్ణయించిన షెడ్యూల్ లో సిరిసిల్లకు చోటే లేదు. దీన్ని సిద్దిపేట జిల్లాలో కలపాలని అధికారులు యోచించారు. కానీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో స్థానికుల కోరిక మేరకు కరీంనగర్ జిల్లాలోనే మూడు జిల్లాలు చేస్తూ కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లను జిల్లాగా చేస్తున్నారు.
కాగా తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే అతి తక్కువ మండలాలు కేవలం 14 మండలాలతో సిరిసిల్ల జిల్లా ఏర్పాటవుతోంది. ఇక తెలంగాణలోనే విస్తీర్ణం, భూభాగంలో అతిపెద్ద జిల్లాగా కొమురం భీం(మంచిర్యాల) జిల్లా ఏర్పాటవుతోంది.. కేటీఆర్ కోరిక మేరకు అధికారులు ఇలా చిన్న జిల్లాగా సిరిసిల్లకు పురుడుపోస్తున్నారు. సిరిసిల్ల జనాలకు ఏదైనా చేస్తేనే అక్కడ కేటీఆర్ గెలుపునకు పునాది కావడంతో తప్పనిసరిగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటవుతోంది..