
సరిగ్గా 20 రోజుల కిందటి సంగతిది.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికని ఎంపీ వినోద్ సిరిసిల్లలో పర్యటించారు. పలుచిన్న చిన్న పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సమయంలోనే కొందరు నాయకులు తమకు సిరిసిల్ల జిల్లా కావాలంటూ ఎంపీ వినోద్ ను అడ్డుకున్నారు. ఆయన ముందు కూర్చొని ధర్నా చేశారట..
కాగా సిరిసిల్ల జిల్లా కోసం ధర్నా చేసిన నాయకులను పిలుపించుకొని మాట్లాడిన ఎంపీ వినోద్ వాళ్లకు సున్నితంగా జిల్లా సాధన ఎలా చేయాలో చెప్పుకొచ్చాడట.. ‘అసలు తెలంగాణ వచ్చేది కాదు.. మేం కూడా ధర్నాలు, నిరసనలు చేస్తే తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటోళ్లు కాదు.. తెలంగాణ ఏర్పాటు వెనుక కాంగ్రెస్ కు రాజకీయ ప్రయోజనం ఉంటుందని నమ్మించాం కనుకే వాళ్లు తెలంగాణ ఇచ్చిండ్లు.. ఎదైనా రోడ్డెక్కితే రాదు.. అదే మీరు కేటీఆర్ ను కలిసి ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే సిరిసిల్లను జిల్లా చేయాలని లాబీయింగ్ చేయండి’ అని సూచించారట.. దీంతో సిరిసిల్ల కు చెందిన నేతలు వెంటనే మంత్రి కేటీఆర్ కు ఫోన్ కొట్టడం.. ఆయన సీఎం కేసీఆర్ తో సిరిసిల్ల జిల్లా చేయాలని కోరడం.. అది జరిగిపోతుండడం చకచకా జరుగుతోందట.. సో అదీ సంగతి.
ఏదైనా ఉద్యమిస్తే కానీ పనులు రాజనీతితో జరుగుతాయని ఎంపీ వినోద్ చాకచక్యంగా నిరూపించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తనయుడిగా కేటీఆర్ స్టామినా ఏందో ిసిరిసిల్ల జిల్లాతోనే నిరూపతమైంది.. అదీ సిరిసిల్ల జిల్లా ఏర్పాటు వెనుక ఉన్న అసలు మతలబు..