అదీ టాలీవుడ్ ఇలా తగలడింది..

హీందీ సినిమాలకు తెలుగు సినిమాలకు చాలా తేడా ఉంది.. ప్రపంచంలోనే ఏ సినిమా ఇండస్ట్రీలో ఉండని ఐడియాలు తెలుగు సినిమాల్లో కనిపిస్తుంటాయి.. మన హీరో తొడ కొడితే ట్రైన్ దానంతట అదే వెనక్కి వెళ్లిపోతుంది. అలా ఉంటుంది మన హీరో స్టామినా .. ఇంత వాస్తవ దూరంగా ఆలోచిస్తున్నారు కనుకే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక మన నిర్మాత హుస్సేన్ సాగర్ లో దూకి బలవన్మరాలకు పాల్పడుతున్నారు..బాలీవుడ్ లో వరుస హిట్ లు సాధిస్తూ 300 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తున్న ఈ అమీర్ ఖాన్ లో ఏముంది.. పట్టిందల్లా బంగారమవుతోంది.. కథ కోసం ఒళ్లు హూనం చేసుకుంటున్నాడు. పాత్ర కోసం ప్రాణాల మీదకుతెచ్చుకుంటున్నాడు. స్టార్ హీరో అయ్యిండి.. ముసలోడి పాత్రలో.. యువకుడి పాత్రలో నటించే దమ్ము ఈయనకు మాత్రమే ఎందుకు ఉంది.. విలక్షణ చిత్రాలతో వరుస హిట్ లు కొడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న అమీర్ ఖాన్ నిజంగా అందరు హీరోలకు స్ఫూర్తి దాయకం..

మన తెలుగు హీరోలు ఒక్క డెబ్బ కొడితే 20 మంది గాల్లో లేచిపోవాలి.. బాలయ్య తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లాలి.. మహేశ్ లాంటి హీరోలు చొక్కా విప్పడానికే సందేహిస్తారు.. అలాంటిది అమీర్ లా పాత్ర కోసం ముసలోడి పాత్రను వేస్తారా.. పవన్ విలన్ల చేతిలో దెబ్బలు తినే పాత్రలు పోషిస్తాడా.. వారికి మనకు అదే తేడా.. వారు కథలో ఒదిగిపోతారు.. మన వాళ్లపై నే కథ రాస్తారు.. అందుకే ఇక్కడ కథలు ప్లాప్ అవుతున్నాయి కనీసం పెట్టుబడి రాకుండా నిర్మాతల్ని ముంచేస్తున్నాయి. అక్కడ మాత్రం కథను బట్టి సినిమా చేస్తారు అందుకే హిట్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దంగల్’ రూ.300 కోట్ల క్లబ్ లో చేరాడు. తెలుగు, బాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కానీ ఫీట్ సాధించాడు. వరుసగా పీకే, దంగల్ చిత్రాలతో 300 కోట్లు కొల్లగొట్టిన హీరోగా చరిత్రకెక్కాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *