Breaking News

సిద్దిపేట x గజ్వేల్.. కలెక్టరేట్ ఎక్కడ.?

kcr-harish-rao_mallanna_sagar_project

సిద్దిపేట జిల్లా విషయంలో ఓ సందిగ్ధత నెలకొంది. అదే ప్రభుత్వ కార్యాలయాలైన కలెక్టరేట్ , ఇతర ముఖ్య కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో అధికారవర్గాల్లో రెండు ప్రతిపాదనలున్నట్టు తెలిసింది. సిద్దిపేట జిల్లా లో గజ్వేల్ నియోజకవర్గం కూడా ఉంది. ఇది సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. దీంతో అల్లుడు మంత్రి అయిన హరీష్ రావు ప్రాతినిధ్య సిద్దిపేటలోనా.. లేక గజ్వేల్ లో కలెక్టరేట్ ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేస్తారా.. అన్న ప్రశ్న ఇప్పుడు సిద్దిపేట వాసులను కుదిపేస్తోంది. కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ సహా కొన్ని కార్యాలయాలను గజ్వేల్ లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులున్నట్టు తెలిసింది. దీంతో దీన్ని ఎలాగైనా ఆపాలని.. సిద్దిపేటలోనే కలెక్టరేట్ ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సిద్దిపేట నాయకులు హరీష్ రావుకు మొరపెట్టుకున్నారట.. కానీ దీనిపై హరీష్ క్లారిటీ ఇవ్వలేదని తెలిసింది.

జిల్లాకేంద్రంగా సిద్దిపేట అవుతుండడంతో కొన్ని కార్యాలయాలను గజ్వేల్ లో ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ ప్రతిపాదనకు ఎవరూ అడ్డుచెప్పడానికి లేదు. దీంతో కేసీఆర్ ప్రతిపాదన పట్టాలెక్కుతుందా..? హరీష్ రావు మాట నెగ్గుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిద్దిపేటలోనే అన్ని జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఎక్కువ మంది మద్దతు తెలుపుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *