Breaking News

ఆ ఎస్సై ఆశల సౌధం కుప్పకూలింది..

si

ఎన్నో ఆశలతో పోలీసు ఉద్యోగం కోసం కష్టపడ్డాడు. పరిగెత్తాడు.. కోచింగ్ తీసుకోవడానికి డబ్బులేకున్నా తెగించి కొట్టాడాడు. చివరకు కానిస్టేబుల్ అయ్యి అనక పట్టుదలతో ఎస్సై అయ్యాడు. ట్రైనింగ్ కోసం ఆదిలాబాద్ జిల్లాలో ప్రొబెషనరీ మొదలైంది. సంవత్సరం పూర్తి అయ్యింది. ప్రొబెషనరీ పూర్తి అయ్యి ఫస్టు పోస్టింగ్ మొన్ననే ఆదిలాబాద్ జిల్లా కెరమెరి వేశారు. జాయిన్ అయిన రెండు రోజులకే తుపాకీ మిస్ ఫైర్ లో ప్రాణాలు కోల్పోయాడు.. ఎన్నో ఆశలతో కొటి కోర్కెలతో భావి జీవితం కోసం వచ్చిన ఓ యువ ఎస్సై ఆర్ధాంతరంగా తన ప్రాణాలు కోల్పోయాడు..
మిస్ పైర్ లో ప్రాణాలు కోల్పోయిన కెరమెరి ఎస్సై శ్రీధర్ స్వగ్రామం ముస్తాబాద్ మం. ఆవునూరు. మత్స్యకార కుటుంబానికి చెందిన శ్రీధర్, కాశవేణి స్వతంత్ర- ధర్మయ్య దంపతుల రెండో కుమారుడు. శ్రీధర్ కు ఒక అన్నా ఒక తమ్ముడు ఉన్నాడు. శ్రీధర్ కు ఇంకా పెళ్ళి కాలేదు. డిగ్రీ బిఎస్సీ, ఎంబిఏ పూర్తి చేసిన శ్రీధర్ 2013 లో కానిస్టేబుల్ గా ఎంపికై ట్రైనింగ్ లో మంచిప్రతిభ కనబర్చి ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకున్నారు. 2014 లో ఎస్ఐ గా సెలెక్ట్ అయిన శ్రీధర్ ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్ జిల్లా కరిమెరి పిఎస్ లో పొందారు. ఇటీవలే విధుల్లో చేరిన శ్రీధర్ అనూహ్యంగా మిస్ ఫైర్ లో ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *