అందుకోసమే శివధర్ రెడ్డి బదిలీ

kcr shivadhar reddy

తెలంగాణ పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల బదిలీలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వీరిని నిన్న అర్ధరాత్రి కేసీఆర్ ప్రభుత్వం బదిలీచేసింది. అన్నీ మామూలుగానే ఉన్నా.. ఓటుకు నోటు సహా నయీం ఎన్ కౌంటర్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి బదిలీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేసీఆర్ కు నమ్మినబంటుగా.. తెలంగాణ లో శాంతిభద్రతలు, నిఘాను పటిష్టం చేసి ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్ ల పనిపట్టిన శివధర్ రెడ్డిని ప్రభు్త్వం బదిలీ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం కమిషనర్ గా ఉన్న శివధర్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రత్యేకంగా పిలుపించుకొని తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించారు. అప్పటినుంచి కేసీఆర్ సహా తెలంగాణ భద్రత విషయంలో చాలా మార్పులొచ్చాయి. చంద్రబాబు సైతం ఓటుకు నోటు లో ఇరుక్కపోయేలా చేసిన శివధర్ రెడ్డిలాంటి స్టిక్ట్ ఆఫీసర్ పై అంతా ప్రశంసలు కురిశాయి.. కానీ ఇప్పుడు అర్ధంతరంగా శివధర్ రెడ్డి బదిలీ సంచలనం రేపుతోంది.

కాగా తీవ్ర పనిఒత్తిడితో సతమతమవుతున్నానని.. తనను కొద్దిరోజులు బదిలీ చేయాలని శివధర్ రెడ్డి కోరిన మీదటే ఆయనను అప్రాధాన్య డీజీపీ కార్యాలయంలోని పర్సనల్ విభాగానికి బదిలీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. కానీ ఓటుకు నోటు కేసులో విచారణ ముగింపు దశకు చేరుతున్న వేళ శివధర్ రెడ్డికి న్యాయ చిక్కులు ఎదురుకాకుండా ఆయన్ను ఇంటెలిజెన్స్ ఐజీ పోస్టు నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *