
తెలంగాణ ఉద్యమం జరిగినప్పటినుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాజకీయ కార్యదర్శి గా పనిచేస్తున్న శేరి సుభాష్ రెడ్డికి కేసీఆర్ అందలమెక్కించారు. తన వద్ద తెలంగాణ ఉద్యమప్పనుంచి కూడా ఆయన కేసీఆర్ కు అండదంగా ఉంటూ సేవలందిస్తున్నారు. కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే బీసీ నేత రామగుండం ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు శేరి సుభాష్ రెడ్డికి ఏకంగా మైనింగ్, గనుల శాఖ చైర్మన్ గా సుభాష్ రెడ్డిని నియమించారు.
కాగా తనను మైనింగ్, గనుల శాఖ చైర్మన్ ను చేసిన కేసీఆర్ కు కుటుంబ సమేతంగా వచ్చి కృతజ్ఞతలు తెలిపారు సుభాష్ రెడ్డి.. ఈ సందర్బంగా కేసీఆర్ మరోసారి తనతో పాటు ఉద్యమంలో నడిచిన వారికి అందలం ఎక్కించారని సుభాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా సుభాష్ రెడ్డి ని తెలంగాణ మంత్రులు, అధికారులు , టీఆర్ఎస్ నాయకులు అభినందలు తెలిపారు. వివిధ మీడియా చానల్స్ పత్రికల్లో సుభాష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.