Breaking News

ఎవరబ్బ సొమ్మని రద్దు చేసేవు..

sbi-writes-off-rs-7016-crore-loans-to-vijay-mallyas-kingfisher-airlines

రైతు రుణమాఫీ కానీ.. మిగతా ఎవరైనా వివిధ కారణాలతో రుణాలు తీసుకుంటే గ్రామాల్లో మన బ్యాంకు అధికారులు ఏం చేస్తారు.. ఇళ్లలో దూరి బెదిరించి మన ఇంటి తలపులు ఊడబికేస్తారు.. గ్రామాల్లో చాటింపు వేస్తారు.. నానా హంగామా చేస్తారు. కానీ వేల కోట్లు ఎగ్గొట్టిన బడా బాబులకు మాత్రం బ్యాంకర్లు కొమ్ము కాస్తాయి. ఇప్పుడూ అదే జరిగింది..

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎస్.బీ.ఐ అదే చేసింది. వేలకోట్లు బ్యాంకు దగ్గర అప్పుతీసుకొని ఇంగ్లాండ్ దేశం చెక్కేసిన కుబేరుడు విజయ్ మాల్యాపై ఎస్ బీఐ కరుణ చూపింది. ఎస్.బీ.ఐ మాల్యా బకాయిపడ్డ 7 వేల కోట్ల రుణం ఇక తిరిగి రాదంటూ రద్దు చేసింది. ఈ వార్త దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. రాజ్యసభలో దీనిపై ప్రతిపక్షాలు గొడవ చేయడంతో కేంద్రం, ఎస్.బీ.ఐ తన తప్పును సరిదిద్దుకుంది. విజయ్ మాల్యాతో సహా పెద్దలకు ఇచ్చిన అప్పులు రద్దు చేయలేదని.. వారు అప్పులు కట్టాల్సిందేనని స్పష్టం చేసింది..

వేల కోట్లు బకాయి పడ్డ వారి అప్పులు రద్దు చేసే కేంద్రం, బ్యాంకులు పేదోడిని మాత్రం పీల్చి పిప్పి చేస్తూ వారికి కనీసం రుణాలు ఇవ్వడానికి కూడా ముందుకు రాకపోవడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *