శాతకర్ణి నుంచి తప్పుకున్న దేవిశ్రీ..

బాలక్రిష్ణ 100 వ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికైన దేవీ శ్రీ ప్రసాద్ ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. శాతకర్ణి మూవీని ఈ సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శకుడు క్రిష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరగా 6 పాటలు ఇవ్వాలని దర్శకుడు క్రిష్ దేవీని కోరాడట.. కానీ చిరంజీవి 150 వ సినిమా, నాని మూవీ, అల్లు అర్జున్ మూవీలతో పాటు పలు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న దేవీ కొద్ది రోజులు ఆగాలని సూచించాడట.. దీంతో సినిమా లేట్ అవుతుందని దర్శకుడు దేవీశ్రీకి స్పష్టం చేశాడట.. దీంతో దేవీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
దీంతో దర్శకుడు క్రిష్ ఈ సినిమా కోసం ఇళయారాజా, కీరవాణిలను సంప్రదిస్తున్నట్టు సమాచారం. వీరూ కాదంటే కంచె మూవీకి సంగీతం అందించిన గుజరాత్ సంగీత దర్శకుడిని ఎంపిక చేస్తారనే వార్తలు వినవడుతున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *