శాతకర్ణి థియేటర్లలో పతాకావిష్కరణ

శాతకర్ణి మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమా ఈరోజు విడుదలయ్యే ప్రతి థియేటర్ వద్ద పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాతకర్ణి విజయచిహ్నంతో ఎగురవేసిన జెండాలను తన సినిమా విడుదలయ్యే ప్రతి థియేటర్లో ఎగురవేయాలని సూచించారు. ఈ నెల 12న చిత్రం విడుదలవుతున్న విశాఖలోని జ్యోతి థియేటర్ లో పతాకాన్ని బాలయ్య ఎగురవేశారు.. అనంతరం సినిమాలోని కొన్ని డైలాగుల్ని బాంబుల వలే పేల్చారు.. మధ్యలో నాన్న గారిని.. తల్లిగారిని తలుచుకొని గౌతమీ పుత్ర సినిమా విశిష్టతను చెప్పుకొచ్చారు..

చిరంజీవి 150 వ చిత్రం ఆడియో వేడుక ఘన విజయం అనంతరం బాలయ్య ఇలా సడెన్ గా విశాఖలో శాతకర్ని పతకావిష్కణ చేయడం విశేషం. అయితే ఈ వేడుకకు దర్శకుడు క్రిష్ కానీ ఇతర ముఖ్య తారాగణం కానీ హాజరుకాకపోవడం మీడియా కంట పడింది. దీంతో బాలయ్యే చిరుకు పోటీగా ఇలా ప్రచారం చేస్తున్నాడని మీడియా మిత్రులు విశ్లేషిస్తున్నారు. దర్శకుడు, నిర్మాతకు పట్టకున్నా బాలయ్య వన్ మ్యాన్ ఆర్మీలా తన సినిమాకోసం కష్టపడుతున్నాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *