Breaking News

ఇసుక మాఫియాను హడలెత్తించిన కేటీఆర్

ktr

తెలంగాణ గనులు, ఐటీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలలో పర్యటించారు. గనుల శాఖ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. ఇటీవలే ఆ శాఖలోని అవినీతి అధికారులను బదిలీ చేసి కేటీఆర్ చర్యలకు ఉపక్రమించారు. కేటీఆర్ అంతేకాదు ఇసుక, గనుల మాఫియాను అరికట్టడానికి ఉపక్రమించారు.

01

అందులో భాగంగానే కేటీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట బ్రిడ్జి వద్ద గల మానేరు వాగు ఇసుక రీచ్ ను సందర్శించారు. ఈ ఆకస్మిక పర్యటనతో అధికారులు బెంబేలెత్తిపోయారు. ఈ సందర్భంగా అక్కడే ఇసుకను కుప్పలుగా పోసి దాచిపెట్టిన ఇసుక మాఫియాపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇసుకను ఇలా దాచేయడమేంటని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇసుకను అక్రమంగా నిల్వచేస్తే ఊరుకునేది లేదని అధికారులకు మాఫియాకు వార్నింగ్ ఇచ్చాడు..

కాగా పరిమితికి మించి లారీల్లో ఇసుక ను తరలిస్తున్న లారీలను సీజ్ చేయించారు కేటీఆర్.. అలాగే అనుమతులు లేకుండా పరిమితికి మించి తవ్వకాలు చేసిన కాంట్రాకర్ట్ లకు అనుమతి రద్దు చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *