
కొద్దిరోజులుగా ఓ టాలీవుడ్ స్టార్ తో డేటింగ్ చేస్తున్నాన్న ప్రకటనలో సమంతపై అందరి ఫోకస్ నెలకొంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ అమ్మడు ప్రేమించింది.. మన తెలుగు హీరో నాగార్జున కుమారుడు నాగచైతన్య అని తేలింది. వీరిద్దరూ గోవాలో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలు వెలుగుచూడడంతో వీరి ప్రేమ వ్యవహారం బయటపడింది..
కాగా నాగార్జున వీరి ప్రేమపెళ్లికి అడ్డుపడ్డాడనే వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ‘చైతన్య తన ప్రేమ విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల నేను, అమల సంతోషంగా ఉన్నాం. తనను సంతోషపరిచే అమ్మాయిని చూసుకున్నాడు’ అని సమంత తమకు నచ్చిందనే విషయాన్ని పరోక్షంగా మీడియతో చెప్పాడు. దీంతో నాగచైతన్య-సమంతల ప్రేమకు ఇక అడ్డంకులు తొలిగిపోయినట్లేనన్న మాట..