జియో అవకాశాలను అందిపుచ్చుకున్న సామ్ సంగ్

gsmarena_001

భారత దేశ బిలియనీర్ ముఖేష్ అంబానీ ప్రారంభించిన రిలయన్స్ జియో లైఫ్ టెలికాం కంపెనీ సేవలను అందిపుచ్చుకునేలా సామ్ సంగ్ ముందుకొచ్చింది. దేశంలో జియో 4జీ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో 4జీ ఫోన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాన్ని అధిగమించేందుకు రిలయన్స్ కంపెనీ లైఫ్ పేరుతో 3000 కే ఫోన్ ను తీసుకొచ్చింది. అయినా కూడా 4జీ ఫోన్ల కొరత వేధిస్తోంది.. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోతో జట్టుకట్టిన సామ్ సంగ్ కొత్తగా తక్కువ ధరలో 4జీ ఫోన్ ను తీసుకొచ్చింది.

సామ్ సంగ్ Z2 పేరుతో లాంఛ్ చేసిన ఈ 4జీ ఫోన్ ను సామ్ సంగ్ కేవలం 4590కే అందిస్తోంది. జియో ఎలాగూ డిసెంబర్ వరకు అన్ని కాల్స్ ఫ్రీ, డేటా ఫ్రీ అని ప్రకటించడంతో 4జీ సిమ్ ను ఇందులో వేసుకొని ఉపయోగించుకోవచ్చు.. జియో అప్లికేషన్లలో ఫ్రీ గా జియో సినిమాలు, మ్యాజిక్, లైవ్ టీవీని చూడొచ్చు.. ఇకేం త్వరపడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *