Breaking News

వామ్మో… ఇంత ఉప్పు వల్ల అనార్థాలెన్నో?

eat-less-salt2

ఎక్కువగా ఉప్పు తింటే బీపీ వస్తుందంటారు… కానీ ఉప్పు లేకుండా ఏదైనా తినగలమా? తగినంత ఉప్పు లేకపోతే వంటలో ఆ రుచి రాదు. ఉప్పు కేవలం వంటలకే కాదు.. ఇంకెన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. నమ్మడానికి కొద్దిగా కష్టంగా ఉన్నా… ఈ కింద చెప్పిన చిట్కాలను పాటిస్తే మీకే అర్ధమవుతుంది..!!

* కొద్దిగా ఉప్పును మీ ఇంట్లోని త‌లుపులు, కిటికీలు, షెల్ప్‌ల వంటి ప్ర‌దేశాల్లో చ‌ల్లండి. దీంతో చీమ‌లు రావు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే తేమ వాతావర‌ణం కూడా పొడిగా మారుతుంది.

* కొంత యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ లో కొద్దిగా ఉప్పు వేసి ఓ మిశ్ర‌మంగా చేసి రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను తోమితే అవి త‌ళ‌త‌ళా మెరుస్తాయి.

* రెండు, మూడు టేబుల్ స్పూన్ల ఉప్పును 3.5 లీట‌ర్ల గోరు వెచ్చని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్రామాన్ని ఉప‌యోగించి కిటికీలు, తలుపులు, గ్లాస్ విండోస్‌, కార్ విండోస్‌ లాంటివి క్లీన్ చేస్తే…. స్ప్రే అవసరం లేకుండానే శుభ్రంగా మెరుస్తాయి.

* వేడి వేడి నీటిలో గుప్పెడు ఉప్పు వేసి కిచెన్ సింక్‌ ను క్లీన్ చేస్తే అందులో జామ్ అయిన చెత్త పోతుంది.

* కొద్దిగా ఉప్పును, ల‌వంగ నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ తో బాగా క‌లిపి శ‌రీరానికి రాయాలి. అనంత‌రం కొంత సేపు అయ్యాక స్నానం చేస్తే చ‌ర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శ‌రీరం కాంతివంతంగా మారుతుంది.

* కార్పెట్లు, దుప్ప‌ట్లు, దుస్తులపై ప‌డ్డ మ‌ర‌కల‌ను తొలగించడానికి… కొంత నీటిలో ఉప్పును వేసి బాగా క‌లిపి, ఆ నీటిలో ముంచిన క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది. దీంతో ఆ మర‌క‌లు ఇట్టే తొల‌గిపోతాయి.

* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని 1 నిమిషం పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి.

* బేకింగ్ సోడ, ఉప్పును స‌మాన భాగాల్లో తీసుకుని కొంత నీటికి కలిపి పేస్ట్‌లా చేసి దాంతో ప‌ళ్లు తోముకుంటే ప‌ళ్లు మిల‌మిలా మెరుస్తాయి.

* దుస్తుల‌ను డిట‌ర్జెంట్ లేదా స‌బ్బుతో ఉతికిన త‌రువాత నీటిలో కొద్దిగా ఉప్పును వేసి ఆ నీటిలో దుస్తుల‌ను ముంచి తీస్తే దుస్తులు ష్రింక్ అవ్వకుండా ఉంటాయి. దీనికి తోడు బ‌ట్ట‌లు శుభ్రంగా, మృదువుగా మారుతాయి.

ఈ విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. వారికి కూడా ఇలాంటి వాటిపై అవగాహన కలిపించండి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *