సాక్షి చిత్రాలు: ఏ ఎండకా గొడుగు..!

తెలంగాణ ప్రాంతంపై ప్రేమ అనేది మన రక్తంలో ఉండాలి. అంతేకానీ అరువు తెచ్చుకొని ఇక్కడ బతకడం కోసం పాటపాడితే ఆ కసి ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఆంధ్రా పత్రిక సాక్షి అలాగే అరువు తెచ్చుకుంది. ఒకే వార్తను ఇటు తెలంగాణకు అనుకూలంగా అటు ఆంధ్రాలో సుతిమెత్తాగా ఆంధ్రాకు అనుకూలంగా మలుచుకొని ఏ ఎండకా గొడుగు పట్టింది..

ఇటీవల సాక్షి మెయిన్ ఎడిషన్ లో ఓ వార్త ప్రచురితమైంది. కేంద్ర పరిశ్రమల శాఖకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఒక దరఖాస్తును ఏపీ ప్రభుత్వం కాపీ చేసిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ఎవరి తప్పు, ఒప్పు అనేది ఇంకా తేలనప్పటికీ మీడియాలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పత్రికలను అమ్ముకుంటున్న సాక్షి రాష్ట్రాలకు అనుగుణంగానే వార్తలు ప్రచురించింది..

తెలంగాణ ఎడిషన్ లో ‘ఏపీ కాపీ కొట్టింది.. అడ్డదారులు తొక్కిందని’ ప్రచురించింది. ఇలా తెలంగాణ సపోర్టింగ్ గా వార్త అల్లింది.. అదే సమయంలో ఏపీ ఎడిషన్ లో మాత్రం ‘‘తెలంగాణ సర్కారు ఏపీపై అకారణంగా కేంద్రానికి కాపీ కొట్టిందని ఫిర్యాదు చేసిందని’ పేర్కొంటూ తెలంగాణ వ్యతిరేక వార్తను ప్రచురించింది.. శీర్షికల విషయంలో, వార్తను ప్రజెంట్ చేయడంలో తేడా చూపించిన సాక్షికి ఏ ప్రాంతానికి అనుగుణంగా ఆ ప్రాంతాల వార్తలను వండివార్చి మొత్తానికి తన పక్షపాతాన్ని చూపించింది..

ప్రస్తుతానికి అన్ని పత్రికలు అదే బాటలో నడుస్తున్నా.. కానీ అవే తెలంగాణకు చెందిన సొంత అస్తిత్వ పత్రికలు అయితే ఇలా తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించేవా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆంధ్రా పత్రికల అవసరార్థమే ఇక్కడ కొనసాగుతున్నాయని పైన కథనాలతో అర్థమవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *