
జగన్ అక్రమాస్తుల కేసుల ఈడీ కొరఢా ఝలిపించింది. భారతి సిమెంట్స్ కేసులో జగన్ లోటస్ పాండ్ లో ఇళ్లు, ఆఫీసు సహా సాక్షి పత్రిక, చానల్ నిర్వహిస్తున్న భవనాలను జప్తు చేసింది. దీంతో సాక్షి పత్రిక, చానల్ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. జప్తు చేస్తే భవనాలకు సీజ్ చేస్తారా లేక.. కార్యాలయాలు నడుపుకోవచ్చా అనే దానిపై స్పష్టత రాలేదు.. ఒక వేళ ఈడీ అధికారులు రంగంలోకి దిగి జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం లేదా సీజ్ చేస్తే ప్రస్తుతం నడుస్తున్న సాక్షి పత్రిక, చానల్ హెడ్ ఆఫీసు మూతపడి ప్రసారాలు , పత్రిక ఆగిపోయే ప్రమాదంలో పడుతుంది.
జగన్ అక్రమాస్తుల కేసులో దాదాపు రూ.749 కోట్ల ఆస్తుల జప్తును చేశారు. వాటిల్లో లోటస్ పాండ్ సహా, బెంగళూరుల్లోని భవనాలు, పలు సంస్థల స్థిరాస్తులు, వాటాలున్నాయి. గుంటూరులో జగన్ కు చెందిన 903 ఎకరాలు భూములు సైతం జప్తు చేశారు అధికారులు.. సీబీఐ విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఈడీ ఈ ఆస్తులను సాక్షి కార్యాలయలను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది.