సెల్‌ఫోన్ గురించి మీరు షాకయ్యే భయంకరమైన నిజాలు..

సెల్‌ఫోన్ ఓ విప్ల‌వం. త‌క్కువ టైంలోనే ఇది ప్ర‌జ‌ల‌ను చాలా త‌క్కువ టైంలోనే ఆక్ర‌మించేసింది. ఇప్పుడు మ‌నిషికి ఆహారం, నీరు, నిద్ర ఎలా అవ‌స‌ర‌మో సెల్‌ఫోన్ కూడా అంతే అవ‌స‌రంగా మారిపోయింది. సెల్‌ఫోన్‌ అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోంది. అయితే సెల్‌ఫోన్ ఎంత ప్రయోజనకారో అంత ప్రమాదకారి అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఐదు అంశాల్లో ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..
1- టాయిలెట్‌ సీటుపై కంటే తరచూ వాడే మొబైల్‌పై పదిశాతం అధికంగా క్రిములు ఉంటున్నట్టు తేలింది. దీనికి కారణం మొబైల్‌ను ఉపయోగించడం తప్ప క్లీన్ చేయాలనే ధ్యాస లేకపోవడమే. వంట చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడ‌డం, త‌ర్వాత ఓ ప‌ని చేస్తూ కూడా చేతులు శుభ్రం చేసుకోకుండా ఫోన్ ముట్టుకోవడం వల్ల ఇకోలి అనే బ్యాక్టీరియా ఫోన్లపైకి చేరుతుంది. దీనివల్ల జ్వరం, వాంతులు, అతిసారం వచ్చే ప్రమాదముంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే సెల్‌ఫోన్‌ను పట్టుకునేముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.

2- సెల్‌ఫోన్ల వ‌ల్ల సెల్ఫీల పిచ్చి విప‌రీతంగా పెరుగుతోంది. దీని వ‌ల్ల చాలా మంది ప్ర‌మాక‌ర ప‌రిస్థితుల్లో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు.
3- సెల్‌ఫోన్ల వ‌ల్ల క్యాన్స‌ర్లు అధిక‌మ‌వుతున్నాయి. ఎక్కువ‌గా సెల్‌ఫోన్ వాడ‌డం వ‌ల్ల ఎలక్ట్రానిక్ తరంగాలు శరీరానికి హాని తలపెట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మెదడుపై ఇవి విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
4-సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ‌డం వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఏడాదికి 16 లక్షల రోడ్డు ప్రమాదాలు సెల్‌ఫోన్ల కారణంగానే సంభవిస్తున్నాయి. ఆరువేల మంది చనిపోతున్నారు. మరెందరో గాయాలపాలవుతున్నారు.
5- వైద్యులు, ముఖ్యంగా నేత్రవైద్య నిపుణులు ఇటీవల కాలంలో మొబైల్ వినియోగదారుల్లో గుర్తించిన ప్రధాన సమస్య కంటిచూపు. సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల, టెలివిజన్‌ను అధికంగా వీక్షించేవారి కంటిచూపు మందగిస్తున్నట్టు కనుగొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *