Breaking News

సైరత్ బ్యూటీ స్కూలుకి వెళ్లింది..

Sairat-Actress-Rinku-Rajguru-HD-Photos

మరాఠీలో సంచలన విజయం సాధించి ‘సైరత్’ మూవీ హీరోయిన్ రింకు రాజ్ గురు తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కించింది. ఇప్పుడు ఈ అమ్మాయి చిత్రం విడుదలై ఘన విజయం సాధించిన తర్వాత స్కూలుకు వెల్లింది. రింకు 9 వ తరగతి చదువుతూనే సైరత్ మూవీలో నటించింది. యువ ప్రేమ జంట కథాంశంగా తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 100కోట్ల వసూలు సాధించి మహారాష్ట్రలో, బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించింది.

కాగా సినిమా విడుదలై ప్రమోషన్, విజయాత్రల్లో పాల్గొన్న హీరోయిన్ ఇప్పుడు స్కూల్లు మొదలు కావడంతో బడిబాట పట్టింది. రింకూ ఇప్పుడు 10వ తరగతిలోకి అడుగుపెట్టింది. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో పదోతరగతి చదువుతోందట.. హీరోయిన్ స్కూలుకు రావడంతో అందరూ ఆమెను చూసేందుకు ఎగబడ్డారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *