Breaking News

రచ్చబండలో కొట్టడానికి చెయ్యెత్తిన రోజా

Roja

మధ్యాహ్నం 12 గంటలు అయ్యిందంటే చాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఇళ్లలో ఈ ప్రోగ్రాంలు రన్ అవుతూనే ఉంటున్నాయి. జీ తెలుగులో బతుకు జట్కాబండితో జీవిత, జెమినీ టీవీలో రచ్చ బండ కార్యక్రమంతో ఎమ్మెల్యే రోజా, ఇక మాటీవీలో సుమత సంసారం ఒక చదరంగం అంటూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వాల్ల కుటుంబ తగదాలను టీవీల్లో ప్రసారం చేస్తూ పెద్ద ఆరిందల వలే పరిష్కారానికి చొరవ చూపిస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ తెగ ఆడేసుకుంటున్నారు ఈ ముగ్గురమ్మలు..

 ఈ మూడు ప్రోగ్రాంలలో కొంచెం జీవిత బతుకుజట్కా బండిలో అతి చేసేది కానీ.. ఇప్పుడు ఆ స్థానాన్ని రోజా లాగేసుకుంది. నిన్న ప్రసారమైన రచ్చబండ ప్రోగ్రాంలో ‘ఏపీ సర్టిఫికెట్ తెచ్చా అది అబద్దమా ’ అని రోజాను నిలదీసిన ఒక ప్రబుద్ధుడిపై ఆగ్రహంతో లేచిన రోజా దాదాపు చేయి చేసుకోబోయింది. కొట్టినంత పనిచేసింది. దీంతో ఈ రచ్చబండ ప్రోగ్రామ్ రచ్చ రచ్చ అయ్యింది..

రోజా చెయ్యేత్తిన వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *