సూపర్ స్టార్ రజినీ కాంత్ అంతటి మహామనిషి నోట కితాబు అందుకున్నారు బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్. రోబో 2.0 మోషన్ పోస్టర్ రిలీజ్ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది. దర్శకుడు శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, హీరోలు రజినీకాంత్, అక్షయ్ కుమార్ లు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా రజినీకాంత్ మాట్లాడుతూ తనకు ఆఫ్షన్ వచ్చి ఉంటే అక్షయ్ కుమార్ పాత్రనే తీసుకునేవాడినని.. ఆ పాత్రలో అక్షయ్ తనకంటే కూడా బాగా నటించారని స్పష్టం చేశారు. నటనలో చాలా ఉన్నతంగా అక్షయ్ నటన ఉందంటూ కితాబిచ్చాడు. కాగా ఈ కార్యక్రమానికి అనూహ్యంగా సల్మాన్ ఖాన్ వచ్చి ఆశ్చర్యపరిచారు. రజినీ అంటే అభిమానమని.. అందుకే పిలవకున్నా వచ్చానని తెలిపారు.
రోబో 2.0 మోషన్ పోస్టర్ ను కింద చూడొచ్చు..