
హైదరాబాద్ లోని రోడ్ల దుస్థితిపై మంత్రి కేటీఆర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు నరకప్రాయంగా ఉన్నాయని.. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులపై మండిపడ్డారు. రోడ్లను బాగు చేసేందుకు వాటి ని వేసే దగ్గర నుంచి మరమ్మతులు చేసేలా ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించనున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్ లో వివిధ శాఖల సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని సమీక్షించారు. ముఖ్యంగా రోడ్ల మెరుగుకు గాను రోడ్ల నిర్మాణం, పర్యవేక్షణ, మరమ్మతులు ఇలా అన్నీ ఒకే సంస్థకు అప్పగిస్తామని.. అధికారులతో ఇది కాదని తేల్చేశారు.. ఇందులో జీహెచ్ఎంసీ, పోలీసు, విద్యుత్తు అధికారులతో కమిటీలు పర్యవేక్షించాలని సూచించారు.