బాబును ఇరికిస్తున్న రేవంత్

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబును ఇరికిస్తున్నారు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆంధ్రాలో ఉద్యమించిన మందక్రిష్ణకు బాసటగా ఢిల్లీలో ధర్నా చేస్తానని రేవంత్ ప్రకటించడం కలకలం రేపింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాదిగలకు హామీ ఇచ్చాడు. ఎస్సీ వర్గీకరణను చేస్తామని..ఢిల్లీలో మోడీపై ఒత్తిడి తెచ్చి సాధిస్తానని మాట ఇచ్చారు. అనక గద్దెనెక్కాక మాట తప్పాడు. దీనికి నిరసనగా మందక్రిష్ణ చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెనుంచి ఏపీలో ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు పోలీసులతో అరెస్ట్ చేయించి మందక్రిష్ణకు చుక్కలు చూపారు.

అక్కడి కి కట్ చేస్తే ప్రస్తుతం మందక్రిష్ణ ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెల రోజు ధర్నాకు ప్లాన్ చేశాడు. ఈ నెల చివరివారం నుంచి ధర్నా మొదలుకానుంది. దీనికి తోడ్పాటు నందించి పాల్గొనాల్సిందిగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కోరారు. రేవంత్ మందక్రిష్ణకు మద్దతిచ్చి ఏకంగా ఢిల్లీలో ధర్నాలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఈ పరిణామాలు చంద్రబాబును ఇరికించేలా ఉన్నాయంటున్నారు టీడీపీ నాయకులు. ఓ వైపు బాబు మందక్రిష్ణకు దూరంగా ఉంటుంటే రేవంత్ మద్దతివ్వడం సంచలనం రేపింది. ఈ విషయంలో బాబు విలన్ గా మారతారని రేవంత్ తీరు మార్చుకోవాలని ఆరోపిస్తున్నాయి టీడీపీ శ్రేణులు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *