గంప ఉమాపతి కి గురజాడ కవితా పురస్కారం..

00-award

కరీంనగర్ కు చెందిన కవి, రచయిత గంప ఉమాపతి గురజాడ ఫౌండేషన్ (యు,ఎస్.ఏ) వారి కవిత పురస్కారం 2016 కు ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ బాధ్యులు సంటి అనిల్ కుమార్ ఆయనకు వర్తమానం పంపించారు. 18-09-2016 ఆదివారం రోజున బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్ లో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమం లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శివారెడ్డి గారి చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకొనున్నారు. గంప ఉమాపతి తొలి సంకలనం గా భావ తరంగాలు ఇటీవలనే వెలువరించారు. కొన్ని కవితలు వివిధ పత్రికలలో ప్రచురించ బడ్డాయి.. వివిధ సందర్భాలలో కవిసమ్మేళనాలలో పాల్గొంటున్నారు. తెలంగాణ కళా వేదిక, సమైక్య సాహితి సంస్థల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.. ఆయనకు ఈ సందర్భంగా మాడిశెట్టి గోపాల్, అనంతాచర్య, సేనాధిపతి, సబ్బని లక్ష్మినారాయణ, కొత్త అనిల్ కుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *