
ఈ ఏడాది లాంచ్ కాబోతున్న రిలయన్స్ జియో 4జీ నెట్ వర్క్ దుమ్మురేపుతోంది.. కేవలం 96 రూపాయలకే 10జీబీ ప్రకటించి సంచలనం రేపిన రిలయన్స్ జియో ప్రస్తుతం మార్కెట్లోకి రాలేదు. ఇప్పుడు కేవలం రిలయన్స్ ఉద్యోగులకే ఉన్న నెట్ వర్క్ ను ఈ ఏడాదికి మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్లాన్ చేసింది..
రిలయన్స్ 4జీ తో పాటు రిలయన్స్ 4జీ ఫోన్లను తక్కువ ధరకు 25శాతం తగ్గించి అమ్మకాలు చేపట్టింది. రిలయన్స్ విండ్, ఫ్లేమ్, వాటర్, ఎర్త్ సిరీస్ ఫోన్లను విడుదల చేసిన రిలయన్స్ వీటి ధరను 3 వేలకు తగ్గించింది. వివిధ మోడళ్ల ఫోన్లన్నీ 4, 5,6 వేల లోపే చాలా ఫీచర్ సదుపాయలతో రిలయన్స్ లాంచ్ చేసింది. బయట 10వేల ఫోన్ ను రిలయన్స్ 5వేలకే అందిస్తుండడంతో ఈ ఫోన్లకు, రిలయన్స్ 4జీ జీయోకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. దీనికోసం జనం ఆతృతగా ఎదురుచూస్తున్నారు..