ఆంధ్రులపై తమిళల ప్రతీకారం

శేషాచలం కొండల్లో ఎర్రచందనం దొంగలంటూ తమిళ కూలీలను చంపిన ఆంధ్రా పోలీసులు, ప్రజలకు ప్రతీకారం తీర్చుకుంటున్నారు తమిళ దర్శకులు.. దీనిపై సినిమా తీసి ఏపీ పోలీసుల ఆగడాలను ఎండగట్టాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పడగానే శేష చలం తిరుమల కొండల్లో తమిళ ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.. దీనిపై తమిళులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.. దేశవ్యాప్తంగా దూమారం రేపిన ఈ సంఘటనపై తమిళనాడులో చాలా సంఘాలు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే..శేషచలం గుట్టల్లో దాదాపు 20మందికిపైగా కూలీలపై కాల్పులు జరిపి వారిని చంపారు ఏపీ పోలీసులు.. ఇప్పుడు తమిళనాడులో ఈ శేషాచలం ఎన్ కౌంటర్ సినిమా తీస్తున్నారు.

తమిళుల ఊచకోతను ఏపీ పోలీసులు ఎంత నిర్ధయగా చేశారో తెలిపేందుకు వీలుగా ‘తూకు మారా పోకల్’ పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ చిత్రానికి కాళీదాస్, ఆగస్టిన్, దర్శకత్వం వహిస్తున్నారు. ఏపీ పోలీసుల అమానవీయ చర్యకు బలైన 20 మంది తమిళుల ఆవేదనను ఎన్కౌంటర్ వెనుక అసలు నిజాలను చిత్రంలో చూపిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *