పండ్లిచ్చే టైంకు చెట్టును కొట్టేస్తారా..?

477586-ravi-shastri-700

భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి ప్రస్తుతం టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రికి దక్కుతుందని అందరూ భావించారు.  కానీ చివరి నిమిషంలో కుంబ్లే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడంతో రవిశాస్త్రిని కాదని కుంబ్లేను భారత క్రికెట్ జట్టు కోచ్ గా నియమించింది బీసీసీఐ.. దీంతో కష్టసమయంలో భారత క్రికెట్ జట్టును తీర్చిదిద్దిన రవిశాస్త్రి ఈ నిర్ణయంపై చాలా నిర్వేదం, నిరాశ, బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

‘నన్ను కోచ్ గా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. తీవ్రంగా నిరాశ చెందా.. ఒక మొక్కను నాటి దానిని పెంచి, పోషించి చివరకు పండ్లను ఇచ్చే సమయంలో పెరుగుతున్న ఆ చెట్టును కొట్టేసినట్టుగా ఉంది నా పరిస్థితి’ అని వాపోయారు రవిశాస్త్రి. భారత క్రికెట్ డైరెక్టర్ గా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు వరుస ఓటములతో ఉన్న జట్టును ఇప్పుడు గెలుపుబాటలోకి నడిపాను. కానీ తనను కాదని కుంబ్లేను కోచ్ గా  చేయడంపై నిరాశ చెందానని వాపోయారు రవిశాస్త్రి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *