రేషన్ ద్వారా ఇక గోధుమలు ఇవ్వరు..

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డప్పటినుంచి కోరుతున్న కోరికకు కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రేషన్ ద్వారా ఇస్తున్న గోధుమలను ఇక నుంచి రద్దు చేస్తోంది.. వాటి స్థానంలో బియ్యంను కేటాయిస్తోంది.. కేంద్ర ప్రభుత్వం ‘ఆహార భద్రత పథకం’ కింద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు బియ్యం, గోధుమలను పంపిణీ చేస్తోంది. కిలో రూ.3 చొప్పున వీటిని రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.. కాగా తెలంగాణలో గోధుమలను ప్రజలు వాడరని.. వాటిని ఎవ్వరూ తీసుకోక మిగిలిపోతున్నాయని తెలంగాణ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది.  రెండేళ్లుగా కోరుతున్న తెలంగాణ ప్రభుత్వ వినతికి ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. వచ్చే నెల నుంచి తెలంగాణకు గోధుమల స్థానంలో బియ్యం కోటాను పెంచుతున్నట్టు తెలిపింది..దీంతో తెలంగాణలో ఇక గోధుమల పంపిణీ రద్దు అయ్యి పోయి బియ్యం సరఫరా పెరగనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *