
తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణ చేశాడు.. స్వతహా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన బాలకిషన్ సినీ, కళాకారులతో కాస్త చనువు ఎక్కువే.. ఖాళీ సమయాల్లో ఆయా సినీ దర్శకుల కోరిక మేరకు సినిమాలు చూస్తుంటాడు.. అలానే ఈ మధ్య వరుసగా రిలీజ్ అయిన రెండు సినిమాలు చూశాడట రసమయి..
కాగా బిచ్చగాడు మూవీ టీం తెలంగాణ ప్రభుత్వం నుంచి సాంస్కృతిక సారథిగా ఉన్న రసమయి బాలకిషన్ ను సినిమా చూడడానికి ఆహ్వానించింది. బిచ్చగాడు చూశాక విలేకరులతో మాట్లాడిన రసమయి సంచలన కామెంట్ చేశారు.. ‘సంచలన కథాంశంతో బిచ్చగాళ్ల బాధలు కళ్లకు కట్టినట్టు చూపిన బిచ్చగాడు మూవీ తెలుగులో బ్రహ్మోత్సవం జరుపుకుంటోందన్నారు. అదే బ్రహ్మోత్సవం మూవీ బిచ్చగాడిలా కనీసం కలెక్షన్లు కూడా సాధించడం లేదని ఆరోపించారు. ఈ కామెంట్స్ పై మహేశ్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
కాగా రసమయి చెప్పినట్టు బిచ్చగాడు మూవీ కేవలం 13 లక్షల రూపాయలతో కొని డబ్బింగ్ చేయించిన తెలుగు నిర్మాతక కాసులు కురిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించి 13కోట్లు కొల్లగొట్టడం విశేషం.