ర్యాంకులు, నివేదికలు.. అంతా హైటెక్ బాబు..

చంద్రబాబు అంటేనే హైటక్.. ఆయన పాలన అంటేనే లెక్కల మయం.. మస్టారులా ప్రతీ దానికి ఓ లెక్కుంటుంది.. దానివెనుక ఓ కిక్కుంటుంది.. ప్రతీ దాన్ని పోల్చి చూసుకోవడం చంద్రబాబుకు అలవాటు.. అందుకే హైదరాబాద్ లా చేస్తా.. సింగపూర్ లా చేస్తాం.. రేయిన్ గన్స్ తెస్తా.. ఇలా పోల్చి ప్రజలకు చేరువ చేస్తుంటారు.. పాలనలో కూడా ఎవరు ఎంత పనిచేస్తున్నారో చెప్పేందుకు ఆయన అధికారులకు ర్యాంకులిస్తుంటారు.. ఇప్పుడవే ర్యాంకులను జిల్లాలకు ఇచ్చారు. తద్వారా అభివృద్ది సంక్షేమం, సామజిక ఆర్థిక లెక్కల ఆధారంగా జిల్లాల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
అభివృద్ధి, సామాజిక, ఆర్థిక, సాధారణ సూచీల ఆధారంగా ఏపీ సీఎం చంద్రబాబు అనని జిల్లాలకు రేటింగ్స్ ఇచ్చాడు. 28న జరగబోయే కలెక్టర్ల సదస్సులో ఈ రేటింగ్స్ ప్రకటించి అధికారులకు దిశానిర్ధేశం చేయనన్నాడు. ఇందులో ఏ, బీ, సీ కేటగిరీల వారీగా రేటింగ్స్ ఇచ్చారు చంద్రబాబు.. ఇందులో ఏ అంటే ఏపీలోనే టాప్ కేటగిరి లిస్ట్ మొదటిస్థానంలో కృష్ణ జిల్లా నిలిచింది. ఆ తర్వాత 2వ స్థానంలో పశ్చిమ గోదావరి, 3వ స్థానంలో ప్రకాశం, 4వ స్థానంలో నెల్లూరు నిలిచి టాప్ 4 సాధించాయి.. ఇక బీ కేటగిరిలో వరుసగా తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, చిత్తూరు, కడపలు స్థానం దక్కించుకున్నాయి. ఇక అట్లడుగున సీ కేటగిరీలో విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాలు నిలిచాయి. మొత్తం గా ఇప్పుడు ఏపీలో అన్ని అంశాల్లో టాప్ లో కృష్ణా, చివరన అనంతపురం నిలిచాయి. ఇదీ బాబు గారి రేటింగ్ ల లెక్కా..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *