
తెలుగు వారి వలే ముస్లింలు చాంద్రమాన కేలండర్ ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే.. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘రంజాన్ మాసం’
ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో ముస్లింలు విధిగా అనుసరించే నియమం ‘ఉపవాస వత్రం’. ఈ ఉప వాసంను పార్సీ భాషలో ‘రోజా’ అని అంటారు. అరబ్బీ భాసలో సౌమ్ అని పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్యఖురాన్ గ్రంథం. రంజాన్ మాసం ప్రారంభమైన నుంచి ముగిసే వరకు నిష్టగా రోజాను ఉపవాస దీక్షలను పాటిస్తారు.
కాగా దేశ, ప్రపంచ వ్యాప్తంగా నిన్న రాత్రి నెలవంక కనిపించింది. దీంతో ముస్లింలు ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున వేడుకలు ఏర్పాట్లు జరిగాయి. పోలీసులు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.