Breaking News

ఒక పతకానికే ఇంత హంగామానా..?

ram-gopal-varma-mos_120215012911
కాంట్రవర్సీ లేనిదే ఆయనకు నిద్ర పట్టడం లేదు. కానీ ఆయన చెప్పే దాంట్లో ఆవేదన ఉంది. నిజం ఉంది. అందుకే ఎంతమందిని తిట్టిపోసినా ఆయన విమర్శలను అందరూ సీరియస్ గానే తీసుకుంటారు.. ఇప్పుడూ ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఒక రజత, కాంస్య పతకాలకే ఇంత బిల్డప్, ఇన్ని కోట్లా అంటూ ప్రభుత్వాలు, జనాలపై మండిపడ్డారు.
 ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒలింపిక్స్ పతకాలపై స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఒక రజతం , ఒక కాంస్యం పతకాలు వచ్చినందుకే మేరా భారత్ మహాన్ అంటూ హడావుడి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముప్పై రెండు కోట్ల జనాభా ఉన్న అమెరికాకు 46 బంగారు పతకాలు వచ్చాయని, ఐదు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియాకు తొమ్మిది బంగారు పతకాలు వచ్చాయని ఆయన చెప్పారు.కాని 120 కోట్ల జనాభా ఉన్న భారత్ కు ఒక రజత పతకం వచ్చినందుకే మనం మేరా భారత్ మహాన్ అంటూ అరుస్తూ పైకి,కిందకు ఎగురుతుంటే అన్ని పతకాలు వచ్చిన అమెరికన్లు ఇంకెంత ఎగరాలని వర్మ ప్రశ్నించారు. నిజమే చిన్న చిన్న దేశాలు కూడా స్వర్ణం గెలిచిన స్థితిలో భారత్ లాంటి 120 కోట్ల జనాబా దేశం ఒక్క స్వర్ణం గెలవకపోవడం నిజంగా మన ధౌర్భాగ్యం.. మన వ్యవస్థ తీరుకు ఇది నిదర్శనం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *