
స్టార్ దర్శకుడు రాజమౌళి తన కొడుకును హీరోగా చూడాలనుకుంటున్నాడట.. ప్రస్తుతం బాహుబలి సినిమా పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి కి తోడుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన కొడుకు కార్తికేయ సేవలందిస్తున్నాడు… బాహుబలి మొదటి పార్ట్ కు ఫైటింగ్ సీన్ ను దాదాపు కార్తికేయ నే పూర్తి చేశాడట.. అంతటి ప్రతిభావంతుడు డైరెక్టర్ అవుతాడని అంతా భావించారు. కార్తికేయ కూడా నాన్నకు తోడుగా డైరెక్షన్ నేర్చుకున్నాడు. ఇక రాజమౌళి భార్య రమ కాస్ట్యూమ్ డిజైనర్ గా సేవలందిస్తున్నారు.
కాగా రాజమౌళి మాత్రం తన కొడుకు ను హీరోను చేయాలని తలపోశాడు. డైరెక్షన్ కాకుండా హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు ముంబైకి ట్రైనింగ్ కోసం పంపుతున్నాడట.. భారీ కథ, కథనంతో భారీ హిట్ ఇచ్చేందుకు కొడుకును గొప్ప హీరోగా చేసేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నాడట.. ఎంతో మందిని భారీ హిట్ లు ఇచ్చి హీరోలను చేసిన రాజమౌళి తన కొడుకు విషయంలో ఎలా స్పందిస్తాడో చూడాలి.