రాజమండ్రిలో ఆటో డ్రైవర్ కొల్లి భూషణం నిజాయితీ

rajamandri

రాజమండ్రి  : .తన ఆటోలో మరచిపోయిన నగలు బ్యాగ్ ను తిరిగి పొగొట్టుకున్న ప్రయాణికులకు ఆటో డ్రైవర్ భూషణం అందజేసి తన నిజాయితీ ని చాటుకున్నారు. రాజమండ్రి అర్భన్ ఎస్పీ బి. రాజకుమారి చేతులు మీదుగా ఆ నగలు డ్రైవర్ భూషణం అందజేశారు. రాజమండ్రి కి చెందిళ వాసంశెట్టి శ్రీనివాస్ దంపతులు ఆదివారం రాత్రి దానవాయిపేట జాగృతి హాస్పటల్ వద్ద చంటిబిడ్డతో ఆటో ఎక్కి పుష్కర ఘాట్ వద్ద దిగారు. శ్రీకన్య హూటల్ కు వెళ్ళి భోజనం చేస్తుండగా తన వస్తువులు, నగలున్న హేండ్ పర్స్ కనిపించలేదు. కంగారు పడి వెతుక్కుంటే అక్కడ లేదు,కిందకు దిగి తాము దిగిన ఆటో కోసం వెతికారు. ఆచూకీ లేదు. కంగారు పడ్డ శ్రీనివాస్ దంపతులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. తర్వాత ఆటో డ్రైవర్ భూషణం తన ఆటోలో మరచిపోయిన పర్స్ ఇవ్వడానికి పుష్కర ఘాట్లో వారికోసం చూశాడు. వారి ఆచూకీ కనిపించలేదు. వారు ఆటో ఎక్కిన ప్రాంతంలో చూశాడు. అక్కడ జాడ దొరకలేదు. ఓ వైపు బాధితులు పోలీసుల సహకారంతో ఆటో గురించి వెతుకుతుండగా, మరో వైపు ఆటో డ్రైవర్ భూషణం వారి గురించిన ఆరా తీస్తుండగా మొత్తానికి వస్తువులు మరచిపోయిన వారి ఆచూకీ తెలిసింది. దీంతో ఆపర్సలో వున్న రెండు లక్షలు విలువైన నగలు, 15వేల నగదు అలాగే వున్నాయి. డిఎస్పీ కులశేఖర్, త్రీటౌన్ సిఐ రామకోటేశ్వరరావులు ఆటో డ్రైవర్ భూషణం ను ఎస్పీ ఆఫీసుకు తీసుకువెళ్ళి ఎస్పీ సమక్షంలో బాధితులకు నగలు,నగదు అందజేశారు. ఈసందర్భంగా లాలా చెరువు ఆటోస్టాండ్ కు చెందిన భూషణం కు నగదు బహూమతి అందించి ,దుశ్శాలువ తో సత్కరించారు. ఆటో డ్రైవర్లు భూషణాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అభినందించారు. భూషణం నిజాయితీ ని పలువురు పోలీసు అధికారులు అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *