
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యం ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. కారుమబ్బులు దట్టంగా అలుముకుంటూ కుంభవృష్టి వానలు పడుతున్నాయి.
ముఖ్యం కరీంనగర్ పట్టణంలో నిన్న కారుమబ్బులు ఇలా కిందకు పడిపోతాయా అన్న చందంగా నల్లగా వచ్చి భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు ఏకధాటిగా పడ్డ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.