ఆర్. నారాయణమూర్తికి థియేటర్లు కావలెను..

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలుగు అగ్రహీరోలు చిరంజీవి, బాలక్రిష్ణలు సంక్రాంతి కానుకగా తమ సినిమాలను రిలీజ్ చేస్తుండడంతో థియేటర్లన్నీ ప్యాక్ అయిపోయాయి. సంక్రాంతికే నారాయణమూర్తి  ‘కానిస్టేబుల్ వెంకట్రామయ్య’తో మనముందుకు వస్తున్నాడు.. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. కానీ ఇక్కడే చిక్కు వచ్చిపడింది.. చిరంజీవి చాలా గ్యాప్ తో వస్తున్న 150 వ సినిమా.. ఇక బాలయ్య 100 చిత్రం సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. వీటి మధ్యలో దిల్ రాజు శతమానం భవతి సినిమా  వస్తోంది ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లన్నీ ఈ చిరు, బాలయ్య సినిమాలతోనే నిండిపోయాయి. మధ్యలో వస్తున్న ఆర్ . నారాయణమూర్తి సినిమాకు అసలు థియేటర్లే దొరకని పరిస్థితి నెలకొంది.. దీంతో ఆర్ నారాయణమూర్తి తన ఆవేదనను హైదరాబాద్ లో విలేకరులతో పంచుకున్నారు.. ‘‘మెగాస్టార్, యువరత్నతో తనకు పోటీలేదు.. నా సినిమా విడుదలకు ప్లాన్ చేసుకున్నాక థియేటర్లు దక్కక ఏడుపొస్తోంది.. నాలుగు థియేటర్లు ఉన్న ఊళ్లో నాకో థియేటర్ ఇవ్వండి.. ఇందుకు ప్రభుత్వం, చాంబర్,నిర్మాతల మండలి సహకరించాలి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో రెండు అగ్రహీరోల ఫైట్ తో చిన్న సినిమాలకు ఎంత కష్టం వచ్చిందో ఆర్ నారాయణ మూర్తి మాటలను బట్టి తెలుసుకోవచ్చు..

ఇలా తన సినిమాలతో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వాలపై , పెత్తందారులపై పోరాటం చేసిన నారాయణమూర్తే ఇప్పుడు తానే అన్యాయమైపోతున్నాడు. సినిమాలో ఎదరించినట్టు ఎదరించలేక తనకూ థియేటర్లు ఇవ్వండి బాబూ అని వేడుకుంటున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో పేరుకుపోయిన ఈ జాఢ్యం పోయేవరకు ఇలాంటి చిన్న సినిమాల పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకతో సమానమే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *