
హైదరాబాద్ ఫిలిం నగర్ లో రోడ్డు మీద, ఆటోల్లో తిరుగుతుంటారు ప్రముఖ హీరో ఆర్. నారాయణ మూర్తి. ఇప్పటికీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన నారాయణ మూర్తి పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళామతల్లికి అంకితం చేశారు. ఈ మధ్యనే మీడియాతో మాట్లాడిన నారాయణ మూర్తి అంతరంగాన్ని ఆవిష్కరించారు.
తనకు కార్లలో తిరగాలని ఖరీదైన బంగళాలో ఉండాలని ఉంటుందని.. తన బ్యాంకులో బ్యాలెన్స్ కూడా ఉందన్నారు. కానీ సాధారణ జీవితం గడపడమే తనకు ఇష్టమన్నారు. తన సొంత ఊళ్లో ఆస్తులు కూడబెట్టలేదని.. తన సొమ్ముతో మా ఊర్లో ఆస్పత్రి కట్టించానని.. విద్యాలయాలకు డొనేషన్లు ఇవ్వడానికి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాగునీటి కోసం చాలా బోర్లు వేసానని డబ్బు ఖర్చు పెట్టానని నారాయణ మూర్తి వాపోయారు.