
జట్ స్పీడ్ తో సినిమాలు చేసే పూరి జగన్నాథ్ కళ్యాన్ రామ్ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా.. విలన్ గా జగపతి బాబు నటిస్తున్నారు. ఇందులో జగపతి బాబు ఊరమాస్, డాన్ గా చూపించబోతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా చిత్రం షూటింగ్ సమయంలో జగపతి డాన్ గెటప్ లో బీడీ తాగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు పూరి జగన్నాథ్..
ఈ సందర్భంగా జగ్గూదా దా ఇజ్ బ్యాక్.. సూపర్ లుకింగ్, స్టైలిష్ అంటూ జగపతి బాబు స్టైల్ కు ఫిదా అయినట్టు పూరి చెప్పుకొచ్చారు. చాలారోజుల తర్వాత జగపతి బాబుతో సినిమా చేస్తున్నానని.. ఆయన తన సినిమాలో నటించడం హ్యాపీ గా ఉందని షేర్ చేశారు పూరి..