రక్షించండి.. చంద్రబాబు శరణుజొచ్చాడు..

ఏపీలో చంద్రబాబు నిర్వహించిన సర్వే గుబులు రేపుతోంది.. ప్రభుత్వ నిఘా వర్గాలతో కలిసి ఓ ప్రైవేటు సంస్థతో చంద్రబాబు తన పాలనపై సర్వే నిర్వహించారట.. అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు కేవలం 51 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే సారాంశం. దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ సహా కీలక టీడీపీ సీనియర్ నాయకులు వ్యూహ బృందం తో సమావేశమయ్యారు. చంద్రబాబు పాలన మంచిగానే చేస్తున్న క్షేత్రస్థాయిలో అధికారులు, ఇతరుల వల్ల చెడ్డ పేరు వస్తోందని.. అందుకే ఇక నుంచి పాలనను ప్రజలకు తెలిసేలా పాలన సాగించాలని నిర్ణయించారు.

అందులో భాగంగా ప్రజలకు పాలన తెలియజేయడానికి చంద్రబాబుతో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ బిగ్ డిబేట్ ను నిర్వహించారు. చంద్రబాబుతో విజయవాడ నుంచి నిన్న రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి చంద్రబాబు మాట్లాడారు. వారి సమస్యలు తీర్చాడు. అంతేకాదు తన పాలనను, టెక్నాలజీ వినియోగాన్ని చూపించారు. ప్రజల్లో చంద్రబాబు పాలనను తీసుకెల్లడమే ధ్యేయంగా కొనసాగిన ఈ ప్రొగ్రాం విజయవంతంతో చంద్రబాబును మరింత సేవ్ చేసేలా ఇంకా కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అయ్యారట చంద్రబాబు అండ్ కో.. అందులో భాగంగానే ఇవాళ అమరావతి నగర నిర్మాణం, కేంద్రం సాయం కొరత తదితర అంశాలపై మళ్లీ ఏబీఎన్ లోనే బిగ్ డిబేట్ పెడుతున్నారట.. ఇలా చంద్రబాబు తన పాలనను ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *