
ప్రధాని నరేంద్రమోడీ రూ.500, 1000 నోట్ల రద్దు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. బ్లాక్ మనీ అరికట్టడంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం కొంత మోధం, కొంత ఖేదాన్ని కలిగిస్తోంది. జనం డబ్బులు మార్చుకోవడానికి, విత్ డ్రా చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనంలో వ్యతిరేకత వచ్చిన మోడీ ఇది మనమంచికే అంటూ సభల్లో చెబుతున్నారు. ప్రజాగ్రహం అయితే తగ్గట్లేదు. బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్న వారి బాధలు అయితే తీరడంలేదు..
ఈ నేపథ్యంలో ప్రధాని తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు నవ్వారని.. ఇప్పుడు అది బెడిసికొట్టి జనాగ్రహం రావడంతో గోవాలో ఏడ్చారని ట్విట్టర్ లో వ్యంగ్యంగా ప్రస్తావించారు. మరి ప్రధాని ఏడుపు ఆయన ప్లాన్ ప్లాప్ కావడం కారణమా.. లేక జనాగ్రహమా అనేది మోడీకే తెలియాలి..