వ్యభిచారానికి వాట్స్ యాప్,ఫేస్ బుక్

ఇప్పటి కాలంలో ఏది కావాలన్న ఇంటర్నెట్ లో లభిస్తుంది. టూత్ పేస్టు దగ్గర నుండి పెద్ద పెద్ద వాహనాల వరకు అన్నిటిని ఇంటర్నెట్ లో కొనుగోలు చేయవచ్చు. ఓ చిన్న పదానికి అర్ధాన్ని తెలుసుకోవడానికి కూడా ఇంటర్నెట్ ని వాడుతున్నారు.. అలానే పెద్ద పెద్ద నేరాలు చేయడానికి కూడా ఇంటర్నెట్ వాడుతున్నారు. నేటి తరం సోషల్ నెట్వర్క్ సైట్లను విపరీతంగా వాడుతున్నారు. ఇలాంటి సోషల్ సైట్లు ఇప్పుడు పాడు పనులు చేయడానికి వేదికగా మారిపోయాయి. ముఖ్యంగా సెక్స్ రాకెట్ నిర్వాహకులు వీటి ద్వారా ఎన్నో పాడు పనులకు పాల్పడుతున్నారు.

సెక్స్ రాకెట్ సూత్రధారులకు ఈ సోషల్ సైట్లు లక్షలు తెచ్చిపెడుతున్నాయి…. వీటితో పాటు పోలీస్ రైడింగ్ ల నుండి కాపాడుతుండడంతో… ఇక వీటిపైనే ఆధారపడి దర్జాగా వారి బిజినెస్ ను పెంచుకుంటున్నారు. వీరి బిజినెస్ ను ఉచితంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తూ ఆ డబ్బును కూడా వెనకేసుకుంటున్నారు. వినియోగదారులకు వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలు పంపించి… నచ్చిన అమ్మాయిని వారి వద్దకు పంపిస్తున్నారు. ఇక ఈ మధ్య వాట్సాప్ లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అనే ఆప్షన్ రావడంతో చెలరేగి పోతున్నారు సెక్స్ రాకెట్ నిర్వాహకులు.

(ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే: వాట్సాప్ ద్వారా మెసేజెస్, ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ లాంటివి… పంపిన వారికి అది అందుకున్న వారికి తప్ప… వాట్సాప్ వారికి, సైబర్ క్రిమినల్స్ కి, చివరికి పోలీసులకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ లభించదు)

పోయిన నెలలో ముంబాయిలోని అంధేరీ లో ఓ మోడల్ వ్యభిచార నిర్వాహణ కేసులో అరెస్ట్ అయ్యింది. ఈమె వాట్సాప్ ద్వారా ఎంతో కాలంగా వ్యభిచార గృహాన్ని నడిపిస్తుందని విచారణలో తేలింది. ఇదే విధానం ఇప్పుడు చెన్నైకి పాకింది. డిజిటల్ ప్లాట్ ఫాం వచ్చిన తరువాత మా పని సులభంగా జరుగుతుందని…. 50 సంవత్సరాలకు పైగా వ్యభిచార గృహాన్ని నడుపుతున్న ఒకావిడ చెప్పిందని సమాచారం.

ఇలా సోషల్ సైట్ల ద్వారా ఎవరికి తోచిన వ్యాపారాలు వారు చేసుకుంటూ పోతుంటే.. చట్టాలు మాత్రం ఎం చేయగలవు చెప్పండి??

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *