ఏమో పొన్నం చేరేటట్టే ఉన్నాడు..

కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ టీఆర్‌ఎస్ లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పొన్నం ప్రభాకర్ సోదరుని కుమారుడు కరీంనగర్లో నెలకొల్పిన ఐటీ స్టార్టప్‌ కంపెనీ *టెలెకా నెట్‌వర్క్‌ టెక్నాలాజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌*ను ప్రారంభించారు. దీంతో పొన్నం ప్రభాకర్ టీఆర్‌ఎస్ లో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడదు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌, మాజీ మంత్రి గడ్డం వినోద్‌, తదితరులు టీఆర్‌ఎస్ లో చేరిన సందర్భంలోనే పొన్నం ప్రభాకర్‌ కూడా టీఆర్‌ఎస్ లో చేరతారని ప్రచారం సాగింది.

ప్రస్తుత కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు వినోద్‌ కుమార్‌ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతనే పొన్నం ప్రభాకర్‌కు పచ్చ జెండా ఊపాలని టీఆర్‌ఎస్ నాయకత్వం అప్పట్లో భావించింది. దాంతో అప్పట్లో ఆయన చేరిక వాయిదా పడినట్లు చెబుతున్నారు.తనకు జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేస్తేనే టీఆర్‌ఎస్ లో చేరుతానని పొన్నం ప్రభాకర్ మెలిక పెట్టడం వల్ల చేరిక ఆగిపోయిందనే ప్రచారం కూడా సాగింది. వేములవాడ అసెంబ్లీ నియోజవర్గానికి వచ్చే ఎన్నికల్లో పొన్నంకు టీఆర్‌ఎస్ కేటాయించే అవకాశమున్నదని కూడా ప్రచారం జరిగింది.
ప్రభాకర్‌ సోదరుడి కుమారుడు ప్రస్తుతం కరీంనగర్లో టెలెకా సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా మంత్రి ఈటెల రాజేందర్‌, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌, ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన గడ్డం వివేక్‌ కూడా హాజరయ్యారు.

ఇదిలా ఉండగా… పోన్నం ప్రభాకర్ మాత్రం కాంగ్రేస్ ను వీడేది లేదని ప్రెస్మీట్ పెట్టి మరీ చెబుతున్నప్పటికి టీఅరెస్ లో చేరే అవకాశాలు మాత్రం ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *