Breaking News

ఎమ్మెల్యేలు, ఎంపీలు ధైర్యముంటే జర్నలిస్టుల గురించి కేసీఆర్ ను ప్రశ్నించండి

తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అసమర్థులని.. జర్నలిస్టుల సమస్యలపై దమ్ముంటే కేసీఆర్ ను ప్రశ్నించడని సవాల్ విసిరారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. కరీంనగర్ లోని కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, వంటావార్పు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ యేనని.. కేసీఆర్ చానాళ్లను నిషేధిస్తే ఢిల్లీలో మాట్లాడి పునరుద్ధరించామన్నారు. కేసీఆర్ అహంకారి అని ఆయనకు నచ్చిందే నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. జర్నలిస్టులకు హామీ ఇచ్చి అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండును సైతం కేసీఆర్ మాయం చేశారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అద్యక్షులు తాడూరి కరుణాకార్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ టోమ్జా రాష్ట్ర అద్యక్షులు అయిలు రమేశ్ , జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్లల రాజేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, సురేంద్రకుమార్, లాయక్ పాషా, కే. భద్రాచలం, ప్రభుదాసు, విజయేందర్ రెడ్డి, వంశీ, జగన్మోహన్, కొండా లక్ష్మన్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, వందలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
కాగా ఈ ధర్నాలో ప్రజాప్రతినిధులు చాడ వెంకట్ రెడ్డి, కటకం మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, విజయరమణరావు, బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ జాతీయ నాయకుడు సుగుణాకర్ రావు, గందె మాధవి, సుజాతరెడ్డి, ఆకుల ప్రకాష్, సుదర్శన్, కొరివి వేణుగోపాల్, పీవీ సూర్యం, పాల్గొని ప్రసంగిస్తూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పొన్నం ప్రభాకర్ జర్నలిస్టుల ధర్నాలో మాట్లాడిన మాటలు పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *