Breaking News

పోలీసుల చరిత్రలో ఇది తొలిసారి..

karimnagar sp

 పోలీసు వ్యవస్థ ఏర్పడ్డప్పటినుంచి ఇదే తొలి విప్లవాత్మక మార్పు.. పోలీసులు అంటే 24 అవర్స్ ఆన్ డ్యూటీ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొచ్చినా ఫోన్ కాల్ రాగానే సంఘటన స్థలానికి బయలు దేరేలా అలెర్ట్ గా ఉండేవారు. వారికి సెలవులు గట్రా ఏమీ ఉండవు.. పండుగలు పబ్బాల్లో మనం జల్సా చేస్తుంటే పాపం పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో రోడ్లపై కాపలాకాస్తుంటారు. అలాంటి పోలీసులకు ఇప్పుడు స్వాంతన చేకూరుతోంది..

sp

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పోలీసులకు వారానికి ఒక సెలవు (వీక్లీ ఆఫ్) ఇస్తూ కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ ఉత్తర్వులు జారీ చేశారు. 365రోజులు విధులు నిర్వహిస్తున్న పోలీసులు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని.. వారి కుటుంబాలకు దూరమవుతున్నారని.. వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని అందుకే వీక్లీ ఆఫ్ లు ఇస్తున్నట్టు ఎస్పీ ప్రకటించారు. ఎవరెవరు ఎప్పుడు వీక్లి ఆఫ్ తీసుకునేది పోలీస్ వెబ్ సైట్ లో నమోదు చేయాలని ఎస్పీ సూచించారు.

sp2

మొత్తానికి కరీంనగర్ ఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా అమలైతే ఇక పోలీసుల జీవితాల్లోనూ కొత్త కాంతిరేఖ వచ్చినట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *