
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి సీయూజీ సిమ్‌కార్డులు అందించేందుకు ప్రభుత్వం సన్నద్దమవు తుంది. నేరాల నియంత్రణతో పాటు అధికారులతో సమన్యయం చేసుకుని సిబ్బంది పని చేయటానికి సీయూజీ సిమ్‌కార్డులు దోహదపడతాయని ఆశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వీటిని అతి త్వరలోనే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్యులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్నతాధికారులతో పాటు పోలీస్ స్టేషన్లకు మాత్రమే సీయూజీ సిమ్ కార్డులు ఉన్నాయి. కానిస్టేబుల్ స్థాయి నుండి ఎస్సై వర కు ఈ సిమ్ కార్డులు అందనున్నాయి. ప్రతి నెలా 1 జీబీ డేటా, రూ.100 టాక్ టైమ్ ఉంటుంది. దీన్ని సిబ్బంది వినియోగించుకోవచ్చు. అంతకు మించి సిమ్‌ను వినియోగిం చుకోవాలంటే అదనంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీయూజీ కార్డులతో రాష్ట్ర వ్యా ప్తంగా పని చేస్తున్న సుమారు 50 వేల మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు. సీయూజీ సిమ్ కార్డులు ఉండటంవల్ల సిబ్బంది, అధికారులకు మద్య సమన్యయంతో నేరాలను నియంత్రిం చేందుకు అవకాశాలు ఉంటాయి. మారుతున్న కాలానుగుణంగా పోలీస్ వ్యవస్థలోనూ మార్పులు, సంస్కరణ లు చోటు చేసుకుంటున్నాయి. చాలామంది కానిస్టేబుళ్ళ వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. శాఖాపరంగా అందించే సీయూజీ సిమ్ కార్డులు తీసుకునేందుకు సిబ్బంది ఆసక్తి చూపుతున్నారు. ఏదైనా సంఘటన జరిగితే ముందుగా స్థలానికి చేరుకు నేది కానిస్టేబుళ్లే. అక్కడ నుండి పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ విషయంలో సీయూసీ సిమ్ కార్డులు ఎంత గానో దోహదపడతాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించటానికి సీయూసీ సిమ్‌లతో సులభమవుతుంది. నేరాలు జరిగిన తర్వాత సాక్ష్యాలను సేకరించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. విధి నిర్వహణలో సిబ్బంది పరస్పరం మాట్లాడుకోవటానికి తేలికగా ఉంటుంది. సిబ్బంది ఎక్కడ పని చేస్తున్నారో అధికారులు తెలుసుకోనే అవకాశం ఉంటుంది. త్వరలోనే ప్రభుత్వం పోలీస్ సిబ్బం దికి సిమ్ కార్డులు అందించనుంది